Reading Time: 1 minute
Tollywood: థియేటర్లలో వచ్చే నో స్మోకింగ్ యాడ్ గర్ల్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది మావ.. అందంలో అప్సరస..

సాధారణంగా థియేటర్లలో ప్రతి సినిమా స్ట్రీమింగ్ కంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు ప్రసారమవుతుంటాయి. అందులో మొదట పోగాకు, ధుమాపానం గురించి అవగాహన యాడ్స్ వస్తుంటాయి. అందులో నో స్మోకింగ్ యాడ్ ఒకటి. అందులో ఓ చిన్నారి తన తండ్రిని చూస్తూ ఉండగా.. ధూమపానం క్యాన్సర్ దారితీస్తుంది అనే మాట వినిపిస్తుంది. అందులో అమాయకంగా కనిపించే ఆ చిన్నారి ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. కేవలం నో స్మోకింగ్ ప్రకటనలో మాత్రమే కనిపించిన ఆ చిన్నారి లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2008లో ఈ యాడ్ రూపొందించారు. ఆ చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్. ఆ యాడ్ తెరకెక్కించినప్పుడు ఆమె వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

సిమ్రాన్ నటేకర్ 150 కి పైగా ప్రకటనలలో నటించింది. ఆ ప్రకటనల తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె బాలిక వధు, లాడో వంటి సీరియల్లలో బాలనటిగా కనిపించింది. ఇక ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. సిమ్రాన్ నటేకర్ దావత్-ఎ-ఇష్క్ చిత్రంలో యువతిగా కనిపించింది. సిమ్రాన్ నటేకర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఆమె ఇప్పుడు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

అమాయకమైన చిన్నారి తనేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క ప్రకటనే ఆమెను ఈరోజు స్టార్‌గా నిలబెట్టింది. ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో హీరోయిన్‌గా నటించడం ప్రారంభించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చాలా ఫేమస్.

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

 

View this post on Instagram

 

A post shared by Simran Natekar (@simran.natekar)

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..