Reading Time: < 1 minute

యువత కోసం కొత్త రాజకీయ వేదిక : కవిత సంచలన ప్రకటన

Caption of Image.

యువత కోసం కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నానని కవిత ప్రకటించారు..తెలంగాణ జాగృతిని కొత్త రాజకీయ పార్టీగా మారుస్తానని చెప్పారు.  ఖచ్చితంగా రాజకీయ శక్తిగా ఎదుగుతానని .. అందరు ఆశీర్వదించి తనకు మద్దతివ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో  జాగృతి పార్టీ పోటీ చేస్తుందన్నారు. ప్రజల పక్షాన మళ్లీ చట్ట సభలకు వస్తానని చెప్పారు. 

బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టినా..ఒక్క ఎకరాకు నీళ్లియ్యలేదన్నారు కవిత. ఇరిగేషన్ శాఖలో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్ఎస్ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం లేదన్నారు.  తనలాంటి ఒకరిద్దరి మహిళలు మినహా మహిళలకు ఆ పార్టీలో చోటులేదన్నారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ లో చోటు లేదన్నారు. అధికారంలోకి వచ్చాక ఉద్యమ ద్రోహులను బీఆర్ఎస్ నెత్తిన పెట్టుకుందన్నారు. ప్రతీ ఆడబిడ్డ తనకు మద్దతివ్వాలని..ఖచ్చితంగా రాజకీయ శక్తిగా తిరిగొస్తానని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.