Reading Time: 2 minutes

నీతి కథ : వేటగాడికి బుద్ధి చెప్పిన జింక, కాకి, ఏనుగు.. అడవిని ఎలా రక్షించుకున్నాయో తెలుసుకుందామా..!

Caption of Image.

అనగనగా ఒక దట్టమైన అడవిలో జింక. కాకి. ఏనుగు కలిసి మెలసి ఉండేవి. అందులో ఏది తిండి తెచ్చినా అన్నీ కలిసి పంచుకుని తినేవి. అలా ఆనందంగా గడిలిపోయేది వాటికి ఒక రోజు ఈ జంతువులన్నీ పెద్ద మర్రి చెట్టు నీడలో సమావేశమయ్యాయి.

ముందుగా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశాం అనేది జింక చెప్తూ గ్రామాల్లో ప్రజలు ఇళ్లను ఎక్కువగా కట్టుకుంటున్నారు. రాత్రిపూట దొంగచాటుగా మన అడవి నుంచి చెట్లను నరికి కలపను తీసుకెళ్తున్నారు. ఎలాగైనా మన సంపదను మనమే కాపాడుకోవాలి” అని చెప్పింది.

తర్వాత ఏనుగు”ఈ విధంగా అడవిని నరుకుతూ పోతే భవిష్యత్తులో మనం నిలబడటానికి నీడ కూడా ఉండదు. మనందరి బతుకులు దారుణంగా మారతాయి. అలాంటి పరిస్థితులు రాకముందే ఏదైనా ఒక ఆలోచన చేయాలి” అన్నది.

“మన స్నేహితులైన కొన్ని పక్షులను వేటగాళ్లు కిరాతకంగా వేటాడి చంపుతున్నారు. కొద్ది రోజుల్లో పక్షిగూళ్ళు కట్టుకోవడం కూడా కష్టం అవుతుంది” అని కాకి కన్నీరు కారుస్తూ చెప్పింది. మిగిలిన జంతువులు కాకిని ఓదార్చి “అందరం ఐకమత్యంగా ఉండాలి” అని నిర్ణయించుకున్నాయి. అంతటితో సమావేశం ముగిసింది.

►ALSO READ | జ్యోతిష్యం: కన్యారాశిలోకి చంద్రుడు.. అదృష్టం వరించే ఆరు రాశులు ఇవే..!

ఒకరోజు సాయంత్రం వేటగాడు అడవికి వచ్చి పక్షుల కోసం వలలు వేశాడు. మరుసటి రోజు తెల్లవారు జామున అడవికి వచ్చి వలలో పడిన పక్షులను తీసుకెళ్లాలని నిర్ణయించుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ వలలో రాత్రి రెండు పక్షి పిల్లలు చిక్కాయి. అవి తల్లి కోసం ఏడుస్తుండగా మిగిలిన పక్షులు వాటిని గమనించాయి. వాటిని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకున్నాయి. వెంటనే అన్ని పక్షులు కలిసి వలలోని పక్షి పిల్లలను కాపాడి వలను కొరికి పాడు చేశాయి. తెల్లవారాక వేటగాడు అడవికి వచ్చి చూస్తే.. వల పూర్తిగా పాడైపోయి ఉంది. దాంతో చేసేదేమి లేక కొత్త వల కొనుక్కున్నాడు.

మరుసటి రోజు యధావిధిగా వల వేసి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు కూడా. పక్షులు అందులో చిక్కడం మిగతా పక్షులు వచ్చి కాపాడటం వేటగాడు గమనించారు. “చేసిన కష్టం అంతా వృథా అయ్యింది. పక్షులు ఐకమత్యంతో రెండు వలలను కొరికేశాయి. ఇక వలలు వేసినా ప్రయోజనం ఉండదు” అనుకుని ఇంటి కెళ్లాడు. ఆ తర్వాత వేట మానేసి కూలీగా మారి కొత్త జీవితం మొదలుపెట్టాడు.

మరొక రోజు ఒకతను చెట్లు కొట్టడానికి ఒక పెద్ద గొడ్డలితో వచ్చాడు. చాలా చెట్లు కొట్టి, కట్టెలు కుప్పలుగా పోశాడు. ఆ కట్టెలను జింకలు అన్నీ కలిసి చెల్లాచెదురు దేశాయి. ఏనుగులు తొండాలతో కొన్ని కట్టెలను నీళ్లలో పాడేశాయి. కట్టెల వ్యాపారి భయంతో బిగ్గరగా కేకలు వేస్తూ, గొడ్డలిని అడవిలో విడిచిపెట్టి ఇంటికి పరుగులు తీశాడు. మరుసటి రోజు నుంచి అతడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఆ అడవి వైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. దాంతో జింక, ఏనుగు. కాకి, ఇతర జంతువులు కలిసిమెలిసి హాయిగా బతుకుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.