
గచ్చిబౌలి, వెలుగు: అధిక వడ్డీ ఆశచూపి, పలువురి వద్ద దాదాపు మూడున్నర కోట్లు వసూలు చేసిన కేసులో కొండపల్లి గణేశ్‌ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. మైహోమ్ భుజాలో నివాసం ఉండే గణేశ్గతంలో నిర్వహించిన వేలంలో రెండుసార్లు గణపతి లడ్డూను దక్కించుకున్నాడు.
ఆ తర్వాత కమ్యూనిటీలో ఏర్పడిన పరిచయాలతో బోయిన్పల్లి కిరణ్ తో కలిసి వ్యాపారంలో పెట్టుబడులు పెడితే నెలకు 6 శాతం వడ్డీ ఇస్తానని చెప్పి పలువురి వద్ద రూ.3.45 కోట్లు వసూలు చేశాడు. తమను గణేశ్మోసం చేశాడని బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌చేసిన పోలీసులు.. అతడి ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలకు మళ్లించిన డబ్బులపై ఆరా తీస్తున్నారు. మొత్తం డబ్బులను విదేశాలకు తరలించారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.