Reading Time: < 1 minute

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పంద్రాగస్టుకు కలర్ఫుల్ లైటింగ్.

Caption of Image.
  • జెండా ఆవిష్కరించనున్న సీఎం  

హైదరాబాద్ సిటీ, వెలుగు:పంద్రాగస్టు సందర్భంగా వేడుకల కోసం చారిత్రక గోల్కొండ కోటతో పాటు సెక్రటేరియేట్, అసెంబ్లీ, చార్మినార్, కాచిగూడ రైల్వేస్టేషన్, ప్రభుత్వ ఆఫీసులు విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి. మువ్వన్నెల జెండా కాంతులు ముచ్చటగొలుపుతున్నాయి. 

కోటలో ఏర్పాట్లు పూర్తి 

గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్న సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు లు వెయ్యి మంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరేడ్ రిహార్సల్స్, కవాతు పూర్తి చేశారు. శనివారం ఉదయం 6  గంటల నుంచి మధ్యాహ్నం 12  గంటల వరకు కోట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ వెల్లడించారు. 

– రామదేవ్‌‌‌‌‌‌‌‌గూడ నుంచి గోల్కొండ కోట వైపు వెళ్లే రోడ్డును 6 నుంచి 12  గంటల వరకు  మూసివేస్తామన్నారు. వేడుకల తర్వాత సెవెన్ టాంబ్స్ నుంచి గోల్కొండ వైపు వచ్చే వారిని గోల్ఫ్ క్లబ్, జమా అకాడమిక్ /జామాలి దర్వాజా వద్ద మళ్లిస్తారు. లంగర్ హౌస్ నుంచి వచ్చే వారిని బడా బజార్ జంక్షన్ వద్ద జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఐలాండ్ వైపు పంపిస్తారు. 

సాయంత్రం రాజ్​భవన్​ రూట్​ వద్దు  

రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌లో శనివారం సాయంత్రం 6  గంటలకు ‘ఎట్ హోమ్’ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 6  గంటల నుంచి రాత్రి 8  గంటల మధ్య మొనప్ప ఐలాండ్ నుంచి వీవీ విగ్రహం జంక్షన్ ఖైరతాబాద్ వరకు ఉన్న రాజ్‌‌‌‌‌‌‌‌భవన్ రోడ్డుకు రెండువైపులా రద్దీ ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

©️ VIL Media Pvt Ltd.