Reading Time: < 1 minute

విశాఖ పవర్ ట్రాన్స్‌మిషన్‌లో అదానీ ఎంట్రీ.. భారీ ప్రాజెక్టులపై ఫోకస్

Caption of Image.

ముంబై:  పవర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ లైన్స్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈసీ పవర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ నుంచి ‘వైజాగ్ పవర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ లిమిటెడ్’ (వీపీటీఎల్‌‌‌‌‌‌‌‌) ను కొనుగోలు చేసింది.  విశాఖపట్నం ప్రాంతంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు  కరెంట్‌‌‌‌‌‌‌‌ను సప్లయ్ చేసేందుకు ఈ  డీల్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకున్నామని  పేర్కొంది.  ఈ ప్రాజెక్టుల నుంచి దాదాపు 4,500 మెగావాట్ల కరెంట్ డిమాండ్ ఉంటుందని అంచనా.  ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే రూ. 8,500 కోట్ల విలువైన ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్న అదానీ ఎనర్జీ, ఈ తాజా కొనుగోలుతో రాష్ట్రంలో తన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను మరింత బలోపేతం చేసుకోనుంది.  ఈ ప్రకటనతో శుక్రవారం ఇంట్రాడేలో కంపెనీ  షేరు ధర 2 శాతం పెరిగి రూ. 1,622.20 స్థాయిని తాకింది. గత ఏడాది కాలంలో ఏకంగా 108 శాతం  పెరిగింది.

 

©️ VIL Media Pvt Ltd.