పాముల గురించి ఏ విషయం అయినా సరే ప్రతి ఒక్కరిలో ఇది ఆసక్తని కలిగిస్తుంది. అందుకే చాలా మంది పాముల గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకు పాముల కథలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలా మంది నాగమ్మకు సంబంధించిన సీరియల్స్, సినిమాలు ఇష్టంగా చూస్తుంటారు. అయితే ఇప్పుడు మనం పాముకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలుసుకుందాం.అయితే చనిపోయిన పాము మళ్లీ తిరిగి కాటు వేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంట. చాలా మంది సైన్స్ పరంగా మాత్రమే చూస్తారు. కానీ, దీని వెనుక పురాణ కథ కూడా ఉన్నదంట. కాగా, ఇప్పుడు మనం చనిపోయిన పాము మళ్లీ కాటు వేయడం వెనుక ఉన్న కారణాలు చూద్దాం.
పురాణాల ప్రకారం చూస్తే.. ఇక పురాణాల ప్రకారం చూస్తే, బ్రాహ్మణుడు, ఒక పామును చూసి వెకిలిగా నవ్వాడంట. ఇది చనిపోయిన పాము ఇది నన్ను ఏం చేస్తుంది అంటూ.. దానిని కాలితో తన్నాడంట. అప్పుడు ఆ పాము వెంటనే రిఫ్లెక్స్ గా అతన్ని కాటువేసిందంట. ఆ క్షణంలోనే బ్రాహ్మణుడు మరణించాడంట. దీంతో ఈ విషయం తెలుసుకున్న గరుత్మంతుడు శివుడిని చేరి, ప్రార్థించగా, ఆయన పాము శరీరం చనిపోయినా విషం చావదు అని చెప్పాడంట.
పాము విషం, దాని స్వభావం వెంటనే చావదు. ఒక వ్యక్తిలో అహంకారం, కోపం ఎలా అయితే ఉంటాయో, పాములో విషయం, దాని స్వభావం కూడా అలాగే ఉంటుదని చెప్పాడంట. అందుకే అప్పటి నుంచి చచ్చిన పామును నమ్మకూడదు అనే సామెత వచ్చింది. అందుకే చాలా మంది పాముల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. చనిపోయినా వాటి జోలికి వెళ్లరు.
సైన్స్ ప్రకారం చూస్తే, పాము చనిపోయిన తర్వాత కూడా మూడు గంటల వరకు కాటు వేయగలదంట. పాము చనిపోయిన తర్వాత కూడా అందులో ఉండే విషయం చాలా యాక్టివ్గా ఉంటుందంట. పాముకు ముందు వైపు ఉండే దంతాలు చాలా విషపూరితమైనవి. పాము చనిపోయినప్పుడు, దానిని కదిలించడం వలన దాని చలనం కలిగి, అది వెంటనే కాటు వేస్తుందంట.
అందుకే ఎప్పుడూ కూడా చనిపోయిన పాము దగ్గరకు కూడా వెళ్లకూడదు అంటారు. ముఖ్యంగా దీని విషం కూడా బతికి ఉన్నప్పు కాటు వేసి మాదిరిగానే పని చేస్తుందంట. అందువలన పెద్ద వారు చెబుతుంటారు. పాము చనిపోయినా సరే దానిని ముట్టుకోకుండా కట్టెతో పట్టుకొని బయట వేయాలి. దానిని కదిలించడం దగ్గరకు వెళ్లి తాకడం చేయకూడదు అంటారు.




