
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, విసిత్ భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. యువ శక్తి ఫర్ వికసిత్ భారత్@2047 థీమ్ తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.. తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం ఆలపించనున్నారు. ముందుగా స్వదేశీ గన్స్‌తో 21 గన్ సెల్యూట్ నిర్వహణ.. ఆ తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ.. తర్వాత మోదీ ప్రసంగం ఉండనుంది. దేశవ్యాప్తంగా 5 వేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానించారు. ఆహ్వానితులకు మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.