Reading Time: < 1 minute

సంక్షేమ పథకాలపై స్టే ఎత్తివేయాలి.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్

Caption of Image.

హుజురాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై హైకోర్టు విధించిన స్టేను తక్షణమే ఎత్తివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్వేరో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఆకినపెల్లి శిరీష ప్రవీణ్ ఆధ్వర్యంలో కరీంనగర్​జిల్లా హుజురాబాద్​ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కీలక సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు, పాత సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించాలన్నారు. జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందెల వెంకన్న, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదేలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.