Reading Time: < 1 minute
యువతకు ప్రధాని మోదీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. కోటి మందికి ఫ్రీ అన్‌లైన్ కోచింగ్, ఏఐ శిక్షణ!

80వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని యువతకు ప్రధాని మోదీ అదిరిపోయే శుభవార్త చెప్పారు. వికసిత్ భారత్.. యువశక్తి లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు.రానున్న సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఏఐ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కోటి మంది యువతకు ఏఐ శిక్షణ ఇవ్వబోతున్నట్టు మోదీ తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్దమయ్యే యువతకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు.

ప్రధాని మోదీ చేసిన కీలక ప్రకటనలు ఇవే

AI యువత నైపుణ్యాభివృద్ధి: దేశవ్యాప్త కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాదిలో కోటి మంది యువతకు AI (కృత్రిమ మేధ)లో శిక్షణ ఇవ్వన్నట్టు ప్రధాని మెదీ తెలిపారు.

ఉచిత ఆన్‌లైన్ కోచింగ్: అలాగే దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించబోతున్నట్టు తెలిపారు. ఆది పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో తోల్పడుతుందన్నారు.

పౌర రక్షణ వ్యవస్థలో సంస్కరణలు: మారుతున్న భద్రతా అవసరాలకు అనుగుణంగా పౌర రక్షణ వ్యవస్థలో ఆధునిక శిక్షణ, మెరుగైన సామర్థ్యాల కల్పన ఉండబోతుందన్నారు.

క్రీడా ప్రతిభ అన్వేషణ: దేశ వ్యాప్తంగా గ్రామాలు, నగరాల్లోని 5 నుంచి15 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో క్రీడా స్పూర్తిని పెంచడమే లక్ష్యంగా, వారి ప్రతిభను వెలికి తీసి.. ప్రతిభావంతులైనా క్రీడాకారులుగా మార్చే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు తెలిపారు.

సెమీకండక్టర్: దేశంలో సెమీకండెక్టర్ ఉత్పత్తులు పెరగబోతున్నాయని.. రానున్న 1–2 ఏళ్లలో దేశ వ్యాప్తంగా సుమారు 7 నుంచి 8 కొత్త సెమీ కండెక్టర్ ఉత్పత్తి కేంద్రాలు కార్యరూపం దాల్చబోతున్నాయన్నారు.

అణు శక్తి: 2047 నాటికి 100 GW సామర్థ్యాన్ని సాధించడం, రాబోయే 6 నుంచి 7 ఏళ్లలో 5 కొత్త రియాక్టర్లను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. తద్వారా భారత్ ఒక శక్తివంతమైన దేశంలో మారుతోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,