Reading Time: 2 minutes

రోహిత్‌ను పక్కన పెట్టడంతోనే అగార్కర్‌కు షాక్.. శ్రీలంక టూర్ తర్వాత బీసీసీఐ బిగ్ డెసిషన్!

Caption of Image.

Rohit Sharma vs Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఊహించని షాక్ తగిలింది. వయసు పైబడిందనే కారణంతో రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి సైలెంట్‌గా తప్పించాలని అగార్కర్ గట్టిగానే స్కెచ్ వేశారు. కానీ, సీన్ రివర్స్ అయి ఇప్పుడు అగార్కర్ కుర్చీకే ప్రమాదం వచ్చిపడింది. శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే అగార్కర్ పదవీకాలం పొడిగింపు, లేదా తొలగింపుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రోహిత్‌కు చెక్ పెట్టబోయి, స్వయంగా తన పదవికే ఎసరు తెచ్చుకున్న అగార్కర్ పరిస్థితి ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రోహిత్ వికెట్ తీయబోయి.. పవర్‌ప్లేలో అగార్కర్ క్లీన్ బౌల్డ్: 
రోహిత్‌కు మెల్లగా పక్కన పెట్టాలని సెలెక్షన్ కమిటీ భావించింది. కానీ బీసీసీఐ మాత్రం సెలెక్టర్ల ప్రతిపాదనను పక్కనపెట్టి రోహిత్‌కే పూర్తి సపోర్ట్ ప్రకటించింది. రోహిత్ శర్మ ఎక్కడికీ వెళ్లడు, రేసులో ఉన్నంతకాలం జట్టులోనే ఉంటాడని బీసీసీఐ చీఫ్ స్పష్టం చేయడంతో అజిత్ అగార్కర్ వేసిన ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయింది. హిట్‌మ్యాన్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అధికారం భారత క్రికెట్ బోర్డు పరిధిలోనే ఉందని తేల్చేయడంతో సెలెక్టర్ల ప్లాన్ ఫ్లాప్ అయింది. ఈ ముచ్చట ఇక్కడక్కడితో ఆగకుండా, శ్రీలంక టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే అగార్కర్‌ను ఢిల్లీకి పిలిపించి, అతడి పదవీకాలంపై రివ్యూ మీటింగ్ పెడతామని బీసీసీఐ స్పష్టం చేసింది. 

విజయాలు సాధించినా తప్పని తిప్పలు: 
వాస్తవానికి అగార్కర్ హయాంలో భారత్ ప్రపంచకప్‌లతో పాటు ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఎంతో సక్సెస్ అయింది. ఈ రికార్డుతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు తన పదవికి తిరుగులేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ధీమాగా ఉన్నారు. కానీ హిట్‌మ్యాన్ విషయంలో బీసీసీఐ ఆలోచనకు భిన్నంగా వెళ్లడంతో, బోర్డు ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్ పొడిగింపుపై పునరాలోచనలో పడింది. రోహిత్ శర్మను సైడ్ చేయడానికి చూస్తే, చివరికి అగార్కర్‌కే బోర్డు ఎసరు పెట్టే వరకు రావడం గమనార్హం.

జట్టు సమతుల్యతే అగార్కర్‌కు అసలైన పరీక్ష:
2027లో జరిగే మెగా టోర్నీకి ముందు రోహిత్ శర్మ ప్రతి సిరీస్ కి అందుబాటులో ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. కాబట్టి సెలెక్షన్ కమిటీ హెడ్‌గా అగార్కర్ తన సుదీర్ఘ వ్యూహాలను అమలు చేస్తూనే, రోహిత్ విషయంలో బీసీసీఐ వైఖరితో కలిసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. శ్రీలంక సిరీస్ ముగిసిన తర్వాత జరగబోయే ఈ సమావేశంలో అగార్కర్ తన పదవీకాల పొడిగింపును ఖరారు చేసుకుంటారా లేదా సెలెక్షన్ విధానంలో బోర్డుతో కొత్త అవగాహనకు వస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

©️ VIL Media Pvt Ltd.