Reading Time: < 1 minute

ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గైర్హాజరు

Caption of Image.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీ వరుసగా 13వ సారి ఎర్రకోటపై నుంచి మువ్వెన్నల జెండా ఎగరేసి అనంతరం జాతినుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. అయితే, ఏఐసీసీ చీఫ్, రాజ్య సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ఎర్రకోటలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలకు గైర్హాజరు హాజరయ్యారు. 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వీరు హాజరు  కాకపోవడం ఇది వరుసగా రెండోసారి. సీటింగ్, ఇతర ప్రొటోకాల్ నిబంధనలు సరిగ్గా పాటించనందునే రాహుల్, ఖర్గే ఎర్రకోట ఇండిపెండెన్స్ డే వేడుకలకు దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2024 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీ సీటింగ్‎పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. 

లోక్ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి కేంద్ర క్యాబినెట్ మంత్రితో సమానమైన హోదా ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం ఇండిపెండెన్స్ డే వేడుకల్లో సెంట్రల్ మినిస్టర్లకు ఫస్ట్ రోలో సీట్లు ఏర్పాటు చేస్తారు. కానీ రాహుల్ గాంధీకి మాత్రం ప్రభుత్వం ఐదవ వరుసలో సీటు కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కేబినెట్ ర్యాంక్ హోదా ఉన్న రాహుల్ గాంధీని ముందు వరుసలో కాకుండా కావాలనే ఐదవ వరుసలో కూర్చొబెట్టి అవమానించారని కాంగ్రెస్ మండిపడింది. ఈ వివాదంతో 2025, 2026 ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య దినోత్సవ వేడుకలకు రాహుల్ గాంధీ, ఖర్గే ఇద్దరు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం సరైన ప్రొటోకాల్ నిబంధనలు పాటించకపోవడం వల్లే రాహుల్, ఖర్గే వేడుకలకు దూరంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. 

మరోవైపు.. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రాజ్య సభ, లోక్ సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రభుత్వం తరుఫున ఆహ్వానం అందించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధికారిక ప్రాధాన్యతా ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపింది.

 

©️ VIL Media Pvt Ltd.