స్లోప్ టెస్ట్: పాల బూత్ నుంచి ఇంటికి తెచ్చిన పాలలో నీళ్లు కలిపారా లేదా అని ఈ టెస్ట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఒక శభ్రమైన గాజు పలక లేదా మెరుగుపెట్టిన టైల్ తీసుకొని దాని పై ఒక చుక్క పాలను వేయండి. అవి స్వచ్చమైన పాలు అయితే నెమ్మదిగా కదులుతూ.. దాని వెనక తెల్లటి గీతను వదిలేస్తాయి. అదే అవి కల్తీ పాలు అయితే.. అవి చాలా వేగంగా, ఎలాంటి తెల్లటి గీతను ఏర్పర్చకుండా ముందుకు జారిపోతాయి.
మీగడను బట్టి: పాల నుంచి వచ్చే మీగడను బట్టి కూడా మీరు పాలలో నీళ్లు కలిపారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఇందుకోసం బాగా మరిగించి చల్లారిన తర్వాత దానిపై ఏర్పడిన మీగడను పరిశీలించండి. ఒక వేళ పాల మీగడ గట్టగా మందంగా వస్తే ఆ పాలలో నీళ్లు కలపలేదని అర్థం. ఒక వేళ మీగడ తక్కవగా, చాలా పలచగా వచ్చిందంటే అందులో నీళ్లు కలిపి ఉండవచ్చు. అయితే కొన్ని సార్లు పాల రకాన్ని బట్టి కూడా మీగడలో మార్పులు వస్తాయి. ఇది కూడా గుర్తుంచుకోండి.
చేతితో పరీక్ష: పాలలో నీళ్లు కలిపారా లేదా అని తెలసుకోవడానికి మరో ఈజీ మార్గం మన చేతితో పరిక్షించడం. ఇందుకోసం పాలలో వేలు పెట్టి పైకి లేపండి. ఒక వేల మీ వేలికి పాల ఎక్కవగా అంటుకుంటే.. ఆ పాలలో నీళ్లు కలపలేదని అర్థం. ఒక వేళ పాలు మీ వేలికి అంటుకోకుండా త్వరగా జారిపోతే, పల్చగా అనిపించినా.. అందులో నీళ్లు కలిపి ఉండవచ్చు.అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే.. ఎందుకంటే పాల చిక్కదనం అందులోని ప్రోటీన్, ఫ్యాట్ స్థాయిలపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు కొనే పాల రకాన్నా బట్టి ఈ రిజల్ట్‌లో మార్పు ఉండవచ్చు.
అయితే పాలలో కేవలం నీళ్లు మాత్రమే కాదు కొన్నిసార్లు స్టార్చ్, డిటర్జెంట్ లేదా ఇతర రసాయనాలను కూడా కలుపుతుంటారు. ఇలాంటి కల్తీ పాలను మన చేతితోనో లేదా రుచి చూడడం ద్వారానో కనిపెట్టలేము. కాబట్టి మీరు కొన్ని పాల రుచి లేదా రంగులో ఏవైనా తేడాలు కనిపిస్తే.. వాటిని వాడక పోవడమే మంచిది. మీకు కల్తీ పాలను కచ్చితంగా గుర్తించాలి అనుకుంటే మార్కెట్లో లభించే లాక్టోమీటర్తో టెస్ట్ చేయవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉన్నా.. వీటిని మీరు ఉపయోగించాలి అనుకున్న.. ఒకసారి నిపుణులను సంప్రదించండి.




