
ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణారెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా ఆగస్టు 21న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథులుగా హాజరైన ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు. రమణారెడ్డి మాట్లాడుతూ ‘హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా ఇది. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో హైదరాబాద్‌లోని సోల్‌తోపాటు బస్తీలోని అందమైన బంధాలను చూస్తారని, అందరూ కనెక్ట్ అవుతారని నటీనటులు, నిర్మాత మాధవి అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.