Reading Time: < 1 minute

ఆసిఫాబాద్ జిల్లా బాబాసాగర్లో పగిలిన హార్డ్ స్టాండ్.. దెబ్బతిన్న చెక్ వాల్స్

Caption of Image.

ఆసిఫాబాద్​ జిల్లా చింతల మానేపల్లి మండలం బాబాసాగర్​లో రూ.7.50 కోట్లతో 4500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించిన ఆర్కగూడ ప్రాజెక్టు మత్తడి కింద ఉన్న హార్డ్ స్టాండ్ దెబ్బతిని పగిలిపోయింది. వరదను అడ్డుకుని కిందకు పంపే చెక్ వాల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఫలితంగా నీరంతా వృథాగా పోతోంది. ప్రాజెక్ట్ వరద ఉధృతి కారణంగా అక్కడి భూమి కోతకు గురవుతూ కొట్టుకుపోతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, రిపేర్లు చేపట్టి నీరు వృథా కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.