
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరగా తెలుగులో డెకాయిట్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. “నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ఆయనే నా అదృష్టం. అసలు నేను ఈ పరిశ్రమలో ఉండటానికి కారణం ఆయనే. నేను ఒక హెయిర్ బ్రాండ్ కోసం ఆయనతో కలిసి ఒక కమర్షియల్‌లో మోడల్‌గా నటించాను. ఆ కమర్షియల్ విడుదలైన తర్వాతే… చిత్రనిర్మాతలు నన్ను గమనించడం మొదలుపెట్టారు. అలా… ఈ ఘనత అంతా ఆయనకే దక్కుతుంది. ఈయన నాకు నిజంగా ఎంతో సహాయం చేశారు. ఆయన చాలా మంచివారు. ఈ విజయం అంతా ఆయనకే దక్కాలి” అంటూ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..
ధురంధర్ 2 సినిమాలో రణవీర్ నటన గురించి మాట్లాడుతూ ఆ నటన పైపైన లేదు. దానిలో లోతు, పొరలు ఉన్నాయి. నేను దానిని రణ్‌వీర్ సింగ్‌గా చూడలేదు. నేను దానిని హంజాగా మాత్రమే చూశాను… అది ఒక హీరో కంటే ఎక్కువగా ఒక పాత్రలా అనిపించింది. రణ్‌వీర్‌ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే అతను చాలా కష్టపడతాడు. అతను ఏది చేసినా అది బ్లాక్‌బస్టర్ కావాలని నేను ప్రార్థిస్తాను, కోరుకుంటానుఆ నటన పైపైన లేదు. దానిలో లోతు, పొరలు ఉన్నాయి. నేను దానిని రణ్‌వీర్ సింగ్‌గా చూడలేదు. నేను దానిని హంజాగా మాత్రమే చూశాను… అది ఒక హీరో కంటే ఎక్కువగా ఒక పాత్రలా అనిపించింది. రణ్‌వీర్‌ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే అతను చాలా కష్టపడతాడు. అతను ఏది చేసినా అది బ్లాక్‌బస్టర్ కావాలని నేను ప్రార్థిస్తాను, కోరుకుంటాను అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..
ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది మృణాల్. అలాగే ఇప్పుడిప్పుడే తెలుగులో సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం క్రేజీ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..