Reading Time: < 1 minute

ఉద్యోగాలు వచ్చేలా ఆధునిక స్కిల్ ట్రైనింగ్ .. ములుగులో ఐటీఐ భవన నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజూరు

Caption of Image.

గ్రేటర్​ వరంగల్, వెలుగు: వరంగల్ యువతకు స్థానికంగానే ఉద్యోగాలు వచ్చేలా ఆధునిక స్కిల్ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నామని వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ సిటీలోని ములుగు రోడ్డులో ఐటీఐ కొత్త భవన నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే 50 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చేలా ఆధునిక స్కిల్ ట్రైనింగ్ సెంటర్​ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.