
హైదరాబాద్: ఐపీఎల్ 19లో భాగంగా 2026, మే 22న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో హైదరాబాద్‌లో ఇదే లాస్ట్ మ్యాచ్ కావడం.. మరోవైపు ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది.
ఈ క్రమంలోనే డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ మ్యా్చ్ టికెట్ ధరలను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భారీగా పెంచింది. టికెట్ రేట్లను డబుల్ చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ శుక్రవారం (మే 15) డిస్ట్రిక్ యాప్‌లో ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే టికెట్ల కోసం అభిమానులు పోటీపడ్డారు. ప్రస్తుతం వెయిటింగ్లో లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు.
లక్షల సంఖ్యలో వెయిటింగ్ చూపిస్తే.. టికెట్ దొరకడమేలా అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. కాసేపట్లో సోల్డ్ ఔట్ అని పెట్టి.. టికెట్లను బ్లాక్ మార్కెట్ లోకి మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఫ్యాన్స్. బ్లాక్ టికెట్ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టికెట్ ధరలు భారీగా పెంచడమే కాకుండా అసలు టికెట్లు అందుబాటులో లేకుండా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ధరలు ఇవే
- 950 టికెట్ 2000 కి
- 1500 ఉన్న టికెట్ 3000 కి
- 1910 ఉన్న టికెట్ 3500 కి
- 2500 ఉన్న టికెట్ 4500 కి
- 4500 ఉన్న టికెట్ 6000 కి
- 7000 ఉన్న టికెట్ ధర 10 వేల రూపాయలకు
- 23 వేలు ఉన్న బాక్స్ టికెట్ ధర 30 వేల రూపాయలకు
- 30 వేలు ఉన్న కార్పోరేట్ బాక్స్ టికెట్ ధర 45 వేలకు పెంపు