
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47’ మూవీ నుంచి క్రేజీ టాక్ వినిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా భావిస్తున్న ఈ సినిమాలో సీరియస్ క్రైమ్ డ్రామా ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయనే టాక్ ఇప్పుడు ఫిలింనగర్‌లో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ‘మీర్జాపూర్’లో ‘మున్నా భయ్యా’ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు శర్మ, ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలోనూ భాగమవ్వడం ఆసక్తిని పెంచుతోంది.
త్రివిక్రమ్ డార్క్ క్రైమ్..
సాధారణంగా కుటుంబ కథలు, ఎమోషన్స్, పంచ్ డైలాగ్స్‌తో సినిమాలు చేసే త్రివిక్రమ్, ఈసారి “AK47” అనే టైటిల్ టచ్‌తో డార్క్ క్రైమ్ ఎలిమెంట్స్‌పై కూడా ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఇలాంటి డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారని టాక్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే దివ్యేందు శర్మ పాత్రపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
►ALSO READ | Trisha Wishes Video: సూపర్ హ్యాపీగా ఉన్నా.. ఎప్పటికీ విజయ్‌కే నా మద్దతు.. సీఎం దళపతికి త్రిష అభినందనలు
ఇక ఈ చిత్రంలో మరో హీరో నారా రోహిత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటించనున్నారని, కథలో ఇది చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అని సమాచారం. పాత్ర నచ్చడంతో నారా రోహిత్ వెంటనే ఓకే చెప్పారని, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొననున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అక్టోబర్ 2న విడుదల..
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక, హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మే నాటికి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. లేదంటే దసరా కానుకగా విడుదల చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
Presenting #VenkateshXTrivikram as “Aadarsha Kutumbam House No: 47 – AK 47”🏠🔥
Shoot begins today 🤗
In cinemas, Summer 2026 ♥️✨#AK47 | #AadarshaKutumbam | #Venky77 | #Trivikram @SrinidhiShetty7 #SRadhaKrishna @haarikahassine pic.twitter.com/pdtl4wh3ro— Venkatesh Daggubati (@VenkyMama) December 10, 2025