Reading Time: < 1 minute
Rukmini Vasanth Replaces Sai Pallavi In M S Subbulakshmi Biopic

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను ‘జెర్సీ’ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ మార్పుపై ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.

మొదట ఈ పాత్ర కోసం నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని అనుకున్నారు. తన నటనతో క్లాసికల్ లుక్‌తో సాయి పల్లవి ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ భావించింది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గోల్డెన్  అవకాశం కన్నడ నటి రుక్మిణి వసంత్ను వరించింది. ‘సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రంతో సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణికి ఇది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్రేక్ అని చెప్పవచ్చు. ఎమోషనల్ డ్రామాలను డీల్ చేయడంలో స్పెషలిస్ట్  దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి సంగీత ప్రస్థానం ఆమె ఎదుర్కొన్న సవాళ్లు మరియు ఆమె గొప్పతనాన్ని అత్యంత సహజంగా చూపించేందుకు ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేశారు. రుక్మిణి వసంత్ క్లాసికల్ లుక్‌లో ఒదిగిపోయే నటి కావడంతో ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని దర్శకుడు భావించినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.