Reading Time: < 1 minute
Ashu Reddy Instagram Story Legal Action Warning 9 Crores Fraud Case

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో రూ. 9.5 కోట్లు మోసం చేశారంటూ.. తనపై నమోదైన పోలీసు కేసుపై సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అషు రెడ్డి ఇన్ స్టా స్టోరీలో ఏముందంటే? తమపై వస్తున్న వార్తలను ఖండిస్తూ అషు రెడ్డి తన స్టోరీలో ఇలా పేర్కొన్నారు

‘నా అనుమతి లేకుండా, నా గురించి ఎటువంటి తప్పుడు సమాచారాన్ని లేదా వార్తలను ప్రచారం చేసినా, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు (Severe Legal Action) తీసుకోబడతాయి’ అని స్పందించింది. గతంలో డ్రగ్స్ కేసు వంటి వివాదాలు చుట్టుముట్టినప్పుడు కూడా అషు రెడ్డి ఇలాగే ధైర్యంగా స్పందించారు. ఇప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణలను ‘తప్పుడు సమాచారం’గా కొట్టిపారేస్తూ, మీడియా,సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. నిజానిజాలు తేలకముందే తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. కానీ పోలీసుల దర్యాప్తు ఒకవైపు సాగుతుండగా, అషు రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాధితుడి కుటుంబం వద్ద ఉన్న ఆధారాలకు అషు రెడ్డి ఎలా సమాధానం ఇస్తారు? చట్టపరంగా ఆమె ముందుకెలా వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.