Reading Time: < 1 minute
2027 Box Office Wars Prabhas Mahesh Babu Ntr And Allu Arjun Ready For Rs 1000 Cr Club

తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో 2027 సంవత్సరం ఒక మైలురాయిగా నిలవబోతోంది. మన స్టార్ హీరోలందరూ గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా, మునుపెన్నడూ లేని విధంగా ఈ క్రేజీ ప్రాజెక్టులు విడుదల కానున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ భారీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీ 2027 మార్చి 5న విడుదల కానుండగా.. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read : JR NTR : శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ ఏప్రిల్ 7న రిలీజ్ కానుండగా, భారతీయ సినిమాకు హాలీవుడ్ స్థాయిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందనే అంచనాలున్నాయి. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న డ్రాగన్ కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. 2027 ద్వితీయార్థంలో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ విడుదల కానుందని తెలుస్తోంది. ఇక పుష్ప తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘రాకా’ కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించబోతుండగా.. బాక్సాఫీస్ షేక్ అవడం గ్యారెంటీ అనే హైప్ ఉంది. మొత్తంగా.. వచ్చే ఏడాదిలో ఈ నలుగురు హీరోలు వెయ్యి కోట్ల సినిమాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం.