
Upcoming Smartphones This Week: ఈ వారం (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు) స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివిధ కంపెనీల నుండి లాంచ్‌లు కాబోతున్నాయి. గ్లోబల్, భారత మార్కెట్లలో ప్రముఖ బ్రాండ్లు వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. ఫోల్డబుల్ డివైస్‌ల నుంచి హై-పర్ఫార్మెన్స్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు వివిధ సెగ్మెంట్లలో మోడళ్లు లాంచ్ కానున్నాయి. మరి ఆ మొబైల్స్ ఏంటి? అవి ఎప్పుడు? ఎక్కడ? లాంచ్ కానున్నాయి చూసేద్దాం..
ఈ లిస్ట్ లో మొదటగా హువావే (Huawei) ఏప్రిల్ 20న చైనాలో భారీ ఈవెంట్ నిర్వహించి Huawei Pura X Max ఫోల్డబుల్‌తో పాటు Huawei Pura 90 సిరీస్‌ను విడుదల చేయనుంది. Pura 90 సిరీస్‌లో స్టాండర్డ్, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఉండగా.. ఇందులో పెద్ద బ్యాటరీలు, 1.5K డిస్‌ప్లేలు, మంచి కెమెరా సెటప్‌లు ఉండనున్నాయి. ముఖ్యంగా Pro Max మోడల్‌లో 200MP పెరిస్కోప్ కెమెరా ఉంది. ఇక Pura X Max ఫోల్డబుల్ 7.6 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో టాబ్లెట్ అనుభూతిని అందించనుంది.
మరోవైపు భారత్ లో Tecno Pop X 5G కూడా ఏప్రిల్ 20న లాంచ్ కానుంది. ఇందులో 6,500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్ వంటి అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో రానుంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు మెరుగైన నెట్‌వర్క్ పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే ఏప్రిల్ 21న Oppo Find X9s, Oppo Find X9 Ultra గ్లోబల్ మార్కెట్లోకి రానున్నాయి. Hasselblad ట్యూన్ చేసిన కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీలు, స్లిమ్ బెజెల్స్‌తో ఈ ఫోన్లు ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా అల్ట్రా వేరియంట్‌లో 200MP ప్రధాన కెమెరా ఉండనుంది.
ఇదే రోజున Redmi K90 Max కూడా చైనాలో లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, Dimensity 9500 ప్రాసెసర్, భారీ 8,550mAh బ్యాటరీతో గేమింగ్, హెవీ యూజర్ల కోసం రూపొందించబడింది. భవిష్యత్తులో ఇది భారత మార్కెట్లో Xiaomi 17T పేరుతో రావచ్చని అంచనా. ఇక టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న Motorola Edge 70 Pro స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 22న భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇందులో 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, Dimensity 8500 ఎక్స్ట్రీమ్ చిప్‌సెట్‌తో పాటు AI ఫీచర్లతో ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ మొబైల్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 90W ఫాస్ట్ చార్జింగ్, 6,500mAh బ్యాటరీతో ఇది ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని అందించనుంది.
ఈ లిస్ట్ లో Honor 600, Honor 600 Pro కూడా లాంచ్ కానున్నాయి. ఈ మొబైల్స్ లో 200MP కెమెరా, Snapdragon చిప్‌సెట్లు, 7,000mAh బ్యాటరీలు, AI ఫీచర్లతో ఈ ఫోన్లు మార్కెట్లో పోటీని మరింత పెంచనున్నాయి. Pro వేరియంట్‌లో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండటం విశేషం. ఇలా అనేక మొబైల్స్ తో ఈ వారం స్మార్ట్ ఫోన్ ప్రేమికులకు పండుగ వాతావరణం నెలకొననుంది. సరికొత్త ఫీచర్లతో, కొత్త టెక్నాలజీలతో వచ్చిన ఈ మొబైల్స్ మార్కెట్లో ఎలా ప్రభావం చూపిస్తాయో చూడాలి.