Reading Time: 2 minutes
Oppo A6s Pro Launched With 7000mah Battery 120hz Amoled Display And Military Grade Durability And More Features

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ ఒప్పో (OPPO) చైనా మార్కెట్‌లో కొత్తగా ఒప్పో A6s ప్రో (OPPO A6s Pro)ను అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన A6 Proకు సక్సెసర్‌గా ఈ ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6.57 అంగుళాల FHD+ 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఇవ్వబడింది. అలాగే ఇది 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ తో పాటు 100% DCI-P3 కలర్ గ్యామట్ సపోర్ట్ ఉండటం వల్ల విజువల్ అనుభవం అద్భుతంగా ఉంటుంది. ఇది మీడియాటెక్ డిమెంసిటీ 6360 మాక్స్ ప్రాసెసర్‌ పై పనిచేస్తుంది.

Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్.. కమిన్స్ వచ్చేస్తున్నాడు..

OPPO A6s Pro మొబైల్ లో 4300mm² VC కూలింగ్ సిస్టమ్‌ తో ఎక్కువ సమయం మొబైల్ హీట్ కాకుండా మంచి పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్‌లో 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ ప్రత్యేకతల్లో ప్రధానంగా దాని డ్యూరబిలిటీ ఒకటి. IP66, IP68, IP69, IP69K వంటి రేటింగ్స్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. 85°C ఉష్ణోగ్రతలో కూడా ప్రెషర్ వాటర్ జెట్స్‌ను తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాకుండా MIL-STD-810H మిలిటరీ స్టాండర్డ్ టెస్టులను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

కెమెరా పరంగా చూస్తే ఇందులో 50MP ప్రధాన కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. ఇక బ్యాటరీ చూస్తే.. ఇందులో ఏకంగా భారీ 7000mAh బ్యాటరీతో పాటు 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. “రైజింగ్ టు ప్రొమినెన్స్ (Rising to Prominence)” వేరియంట్‌లో 3D Depth-of-Field లైట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించగా.. మరోక “గుడ్ లక్ లోటస్” వేరియంట్‌లో ఫాంటమ్ కలర్ LCD టెక్నాలజీ వినియోగించారు. అలాగే “మూన్ షైన్ బ్లూ” కలర్ నైట్ స్కై నుండి ప్రేరణ పొందింది.

Unclaimed Assets: పాత బ్యాంక్ ఖాతాలో డబ్బులున్నాయా.. షేర్లలో డబ్బులు పెట్టి మర్చిపోయారా..? వెతికి పట్టుకోండిలా..

ధరల విషయానికి వస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర సుమారు రూ.30,000 (2199 యువాన్) కాగా, 8GB + 256GB రూ.32,700, 12GB + 256GB రూ.36,800, 12GB + 512GB వేరియంట్ రూ.40,900 వరకు ఉంటుంది. ఈ ఫోన్ చైనాలో ఏప్రిల్ 17 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఇక భారత మార్కెట్‌లో ఈ ఫోన్ ఒప్పో F33 ప్రో పేరుతో ఏప్రిల్ 15న విడుదల కానుంది. దీంతో భారత వినియోగదారులకు కూడా ఈ ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ త్వరలో అందుబాటులోకి రానుంది.