Reading Time: < 1 minute
Abhishek Sharma Registers Unwanted Record With Golden Duck In Ipl 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పరుగులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించగా.. రవి బిష్ణోయ్‌ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్‌ ఖాతాలో చెత్త రికార్డులు చేరాయి.

ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటైన రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు ఈ చెత్త రికార్డు గబ్బర్ శిఖర్ ధావన్ పేరుపై ఉంది. 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో ధావన్ తొలి బంతికే అవుటై ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అభిషేక్ ఆ చెత్త రికార్డును పునరావృతం చేశాడు.

Also Read: Ishan Kishan Big Decision: ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి దూరం!

2026 క్యాలెండర్ ఇయర్ ప్రారంభమైనప్పటి నుంచి అభిషేక్ శర్మ టీ20ల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఏడుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గతంలో కూపర్ కన్నోలి 17 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు డకౌట్ అయిన రికార్డును అభిషేక్ అధిగమించి.. అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శ‌ర్మ (2018లో 6 సార్లు), సంజూ శాంస‌న్ (2024లో 6 సార్లు), గురుకీర‌త్ సింగ్ (2103లో 5 సార్లు) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.