
హమ్మయ్య.. బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ శాంతించాయి. పశ్చిమాసియా యుద్ధం జరిగినంత కాలం బంగారం ధరలు బాగానే పతనం అయ్యాయి. దీంతో మగువలు, సామాన్యులు సంబరపడ్డారు. బుధవారం ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటించారో.. లేదో వెంటనే ధరలకు రెక్కలొచ్చాయి. మళ్లీ పరిస్థితులు మొదటికి రావడంతో తాజాగా మళ్లీ ధరలు తగ్గాయి. తులం గోల్డ్‌పై రూ.2,340 తగ్గగా.. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది.
తులం గోల్డ్‌పై రూ.2,340 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,150 తగ్గడంతో రూ.1,38,850 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,760 తగ్గడంతో రూ.1,13,610 దగ్గర ట్రేడ్ అవుతోంది.
హమ్మయ్య.. సిల్వర్ ధర కూడా దిగొచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,55, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,60,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,55, 000 దగ్గర అమ్ముడవుతోంది.