Reading Time: < 1 minute
Stock Market Today Sensex Nifty Fall Israel Iran Tensions

దేశీయ స్టాక్ మార్కెట్‌ మళ్లీ ఒడుదుడుకులు ఎదుర్కొంటోంది. నిన్న ఇరాన్‌తో అమెరికాకు కాల్పుల విరమణ జరగడంతో మార్కెట్ భారీగా పుంజుకుంది. అయితే గంటల వ్యవధిలోనే మళ్లీ పరిస్థితులు దిగజారిపోయాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం.. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అంతేకాకుండా శాంతి చర్చలపై కూడా ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో గురువారం మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. నిన్న భారీ లాభాలు అర్జించగా.. అంతలోనే ఆశలు ఆవిరైపోయాయి.

ప్రస్తుతం సెన్సెక్స్ 249 పాయింట్లు నష్టపోయి 77, 313 దగ్గర కొనసాగుతుండగా… నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 23, 944 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఎన్‌టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, మాక్స్ హెల్త్‌కేర్, బజాజ్ ఆటో, హిండాల్కో వంటి ప్రధాన షేర్లు లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం వంటి షేర్లు నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: JD Vance: ఇరాన్ పొరబడుతోంది.. ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు

ఇది కూడా చదవండి: Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు