Reading Time: 2 minutes
Iran Closes Strait Of Hormuz Again Israel Lebanon Attacks Impact Global Oil

Iran: ఇరాన్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న అమెరికాతో రెండు రోజులు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ఈ కాల్పుల విరమణకు ముందు ఇరాన్‌ ముందు పది ప్రతిపాదనలు ఉంచారు. ఇందులో అతి ముఖ్యమైన ప్రతిపాదన హార్ముజ్ జలసంధి(Strait of Hormuz)ని తెరవడం. ఇందుకు ఇరాన్‌ సైతం అంగీకరించింది. కానీ.. తాజాగా ఇరాన్ హర్మూజ్‌ను మూసివేసినట్లు తెలిపింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులపై నిరసన ముసివేసినట్లు స్పష్టం చేసింది. ఓ వైపు అమెరికా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్‌ మాత్రం ఇరాన్‌పై దాడులు తీవ్ర తరం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ హార్ముజ్‌లో ఆయిల్‌ ట్యాంకర్ల రాకపోకలను బంద్‌ చేసింది.

READ MORE: RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

తాజాగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేనని ఇరాన్ వాదిస్తోంది. అయితే, ఇజ్రాయెల్ మాత్రం ఈ ఒప్పందానికి లెబనాన్‌తో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ బుధవారం లెబనాన్‌పై చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో విరుచుకుపడింది. 100కు పైగా హిజ్బుల్లా కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సుమారు 254 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఇరాన్ ఆగ్రహించింది. “జియోనిస్ట్ (ఇజ్రాయెల్) దాడులకు నిరసనగా హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నాం. కాల్పుల విరమణ అనేది అన్ని రంగాల్లో అమలు కావాలి, లేదంటే ఎక్కడా ఉండదు” అని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ప్రతినిధి ఇబ్రహీం రెజాయ్ ఘాటుగా స్పందించారు. ఈ నిర్ణయంతో మారోసారి ప్రపంచ దేశాల చమురు సరాఫరకు ఇబ్బందిగా మారింది.

READ MORE: David Miller: డ్రామా, థ్రిల్లర్, చివరికి నిరాశ.. ఆ చివరి ఓవర్‌లో అసలేం జరిగింది? మిల్లర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా?

ఈ అంశంపై తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పందించారు. “గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్‌ బలహీనపడింది.. ఇరాన్‌ యుద్ధంలో పెద్దఎత్తున లక్ష్యాలను సాధించాం.. అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పది.. ట్రంప్‌తో సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి.. నాయకత్వం వహించిన ట్రంప్‌కు ధన్యవాదాలు.. మా వేలు ట్రిగ్గర్‌పై సిద్ధంగా ఉంది.. కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదు.. లెబనాన్‌.. సంధిలో భాగం కాదు.. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తాం.” అని స్పష్టం చేశారు.