
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ లీగ్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఢిల్లీ.. హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన గుజరాత్ జట్టు తొలి విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తన జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. గుజరాత్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. కుమార్ కుషాగ్రా స్థానంలో శుభ్‌మాన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీశ్ రాణా, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ.