Reading Time: < 1 minute

ఎయిర్‌పోర్టులపై వస్తున్న అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫీజబులిటి ఉన్న చోట ఎయిర్‌పోర్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్‌లో పెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఉంటుందని అన్నారు. సివిల్ ఏవియేషన్‌తో కలిసి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ చెప్పిందని తెలిపారు.

ఈ నెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని పేర్కొన్నారు. రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఆదిలాబాద్‌లో రక్షణశాఖకు 360 ఎకరాలు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కావాల్సిన అనుకూలతలు ఆదిలాబాద్‌కు ఉన్నాయని.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఏయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వివరించారు. పెద్దపల్లి ఎయిర్‌పోర్టు ప్రతిపాదనపై ఫీజబులిటీ నివేదిక సానుకూలంగా ఉందని అన్నారు.