Reading Time: < 1 minute
Rohit Sharma Struggles Vs Sandeep Sharma Shocking Ipl Head To Head Stats Revealed

‘హిట్‌మ్యాన్’ రోహిత్‌ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెస్ట్, వన్డేల్లో కాస్త సమయం తీసుకున్నా.. టీ20ల్లో మాత్రం ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుపడుతాడు. కళ్లు చెదిరే సిక్సులు, మెరుపు బౌండరీలు బాదుతూ.. పరుగుల వరద పారిస్తుంటాడు. అలాంటి హిట్‌మ్యాన్‌ను ఐపీఎల్‌లో భారత బౌలర్ సందీప్ శర్మ పరుగులు చేయకుండా ఆడుకుంటున్నాడు. ఇద్దరి మధ్య ఐపీఎల్‌లో షాకింగ్ గణాంకాలు నమోదయ్యాయి.

ఐపీఎల్‌లో బ్యాటర్ రోహిత్‌ శర్మ, స్వింగ్ బౌలర్ సందీప్ శర్మ మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య గణాంకాలు చూస్తే.. సందీప్ పూర్తిగా పైచేయి సాధించాడు. ఇప్పటివరకు సందీప్ వేసిన 47 బంతులను ఎదుర్కొన్న రోహిత్.. కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అంటే హిట్‌మ్యాన్ స్ట్రైక్ రేట్ కేవలం 80.85 మాత్రమే. టీ20 ఫార్మాట్‌లో ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. సందీప్ బౌలింగ్‌లో రోహిత్ ఇప్పటికే 6 సార్లు ఔట్ అయ్యాడు. దాంతో రోహిత్ సగటు 6.33గా పడిపోయింది.

Also Read: Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!

సందీప్ శర్మ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఏకంగా 30 డాట్ బాల్స్ ఆడటం విశేషం. సందీప్ లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్‌తో రోహిత్‌ను కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఓ టాప్ క్లాస్ బ్యాటర్‌కు ఇలాంటి గణాంకాలు చాలా అరుదు. భవిష్యత్తులో ఈ రికార్డును రోహిత్ మారుస్తాడా? లేక సందీప్ తన డామినేషన్ కొనసాగిస్తాడా? అన్నది చూడాలి. హిట్‌మ్యాన్ 275 ఐపీఎల్ మ్యాచ్‌లలో 7164 రన్స్ చేశాడు. ఇందులో రెండు శతకాలు, 48 అర్ధ శతకాలు ఉన్నాయి.