Reading Time: < 1 minute
Tg High Court Adjourned Its Verdict On Justice P C Chandra Ghosh Commission Report To 22nd April

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22కి తీర్పును వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై లోతైన విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

Also Read:Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా? ‘జాను’ షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన!

ఈ కమిషన్ విచారణ ప్రక్రియను తప్పుబడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్.కే. జోషి కోర్టును ఆశ్రయించారు. కమిషన్ తమ వాదనలను సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని, కాబట్టి ఈ నివేదికను రద్దు చేయాలని వారు తమ పిటిషన్లలో కోరారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం మరియు పిటిషనర్ల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్ తీర్పును రిజర్వు చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.