Reading Time: 2 minutes
Hardik Pandya Praises Vaibhav Suryavanshi Bumrah Ipl 2026 Rr Vs Mi

Hardik Pandya: నిన్న రాజస్థాన్ రాయల్స్ (RR), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన మధ్య జరిగిన పోరు మామూలుది కాదు. ఓ 15 ఏళ్ల కుర్రాడికి, ప్రపంచంలోనే అత్యంత డేంజరెస్ యార్కర్ బుమ్రాకు మధ్య జరిగిన సమరం ఇది. మ్యాచ్‌కు ముందు బుమ్రా vs వైభవ్ సూర్య వంశీ కాంబినేషన్ కోసం అందరూ ఎదురు చూశారు. ఈ 15 ఏళ్ల బుడ్డోడు ఇప్పటికే వరుసగా తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కానీ బుమ్రాను మాత్రం ఒక్కసారి కూడా ఎదుర్కోలేదు. నిన్నటి మ్యాచ్‌లో తొలిసారిగా వైభవ్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఫస్ట్ బాల్‌నే ఈజీగా బౌండరీ దాటించాడు. ప్రపంచ మేటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనే రెండు భారీ సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఒకవైపు సూర్యవంశీ మెరుపులు మెరిపిస్తుంటే, మరోవైపు యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి వీరవిహారంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేయలేకపోయింది. దీంతో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది.

READ MORE: Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!

అయితే మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇస్తున్న క్రమంలో ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. వైభవ్ సూర్య వంశీ దగ్గరకు రాగానే హార్దిక్ పాండ్యా తన జట్టు ఓటమిపాలైందన్న విషయం మర్చిపోయాడు. ఆ క్షణంలో ఈ 15 ఏళ్ల కుర్రాడి ప్రతిభను చూసి ముగ్ధుడైపోయాడు. సూర్యవంశీ వద్దకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా, అతనిలో ఉన్న నిర్భయత్వం, షాట్లు ఆడే తీరు అద్భుతమని కొనియాడాడు. మ్యాచ్‌కు ముందు కూడా తమ జట్టులో సూర్యవంశీ గురించే ఎక్కువ చర్చ జరిగిందని, ఇంత చిన్న వయసులో అతను ఆడుతున్న తీరు భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తోందని పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ బుడ్డోడు మాత్రం బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు బాది ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్శించాడు.