Reading Time: < 1 minute
Stock Market Rally Sensex Nifty Surge Trump Iran Ceasefire Rbi Policy

హమ్మయ్య.. 40 రోజుల తర్వాత పశ్చిమాసియా శాంతించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంది. ప్రస్తుతం భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి. బుధవారం మన మార్కెట్ కూడా భారీ లాభాలతో బోణీ కొట్టింది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో దూసుకెళ్తున్నాయి. పైగా బుధవారం ఆర్బీఐ పాలసీ వెల్లడించనుంది. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు మంచి జోష్ వచ్చినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.

ప్రారంభంలో సెన్సెక్స్ 2,586 పాయింట్ల లాభపడి 77, 203 దగ్గర కొనసాగగా.. ప్రస్తుతం 2,605 పాయింట్ల లాభంతో 77,265 దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 781 పాయింట్లు లాభపడి 23, 905 దగ్గర కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న ఇన్వెస్టర్లు.. ఒక్క దెబ్బతో లక్షల కోట్ల సంపద జేబుల్లోకి వచ్చి పడింది.

ఇది కూడా చదవండి: Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్‌ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అంతేకాకుండా ప్రభుత్వంలోని కీలక నేతలంతా చనిపోయారు. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ భారీ నష్టాలను ఎదుర్కొంది. తాజాగా ట్రంప్ సీజ్‌పైర్‌ వ్యాఖ్యలతో మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి.