
హైదరాబాద్: హైదరాబాద్ మదీనా గూడ GSM మాల్‌లోని బార్బెక్యూ నేషన్, చైనీస్ వోక్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. లేబుల్స్ లేని బ్రౌనీస్, పాన్, మలై, కేశర్ పిస్తా కుల్ఫీలను గుర్తించారు. లేబుల్స్ లేని ఆహార పదార్థాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని అధికారులు పడేశారు. ఫుడ్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్, పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో లేవని గుర్తించారు. కూరగాయల క్రేట్లు, వాటర్ బబుల్ కంటైనర్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. చాపింగ్ బోర్డులు దెబ్బతిన్న స్థితిలో ఉండటంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
🍽️ Food Safety Inspection Drive 2/2
Restaurant: Chinese Wok
📍 GSM Mall, Madinaguda
📅 29.06.2026As part of routine food safety inspections across Cyberabad, CMC Food Safety teams inspected Chinese Wok.
✅ Good Practices
• No pest activity observed; pest control and water… pic.twitter.com/xmHO8XP0pu— Cyberabad Municipal Corporation (@CMC_Offcl) June 29, 2026
ఫ్రూట్ స్టోరేజ్ ఏరియా, రిఫ్రిజిరేటర్ల దగ్గర బొద్దింకలు తిరుగుతున్నాయి. వండిన అన్నానికి శాస్త్రీయ ఆధారాలు లేకుండానే 36 గంటల షెల్ఫ్ లైఫ్ నిర్ణయించారు. ఫుడ్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్, వార్షిక మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు లేవని అధికారులు తెలిపారు. వంటకు ఉపయోగించే గుడ్లను శుభ్రం చేయకుండా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రైస్, నూడుల్స్ తయారీ ప్రాంతంలోని వాటర్ ట్యాపులు అపరిశుభ్రంగా ఉన్నాయి. రెండు రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు.