Reading Time: 2 minutes
Psl Vs Ipl Players Commentators Leaving Mohsin Naqvi Embarrassment

Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్ రోజురోజుకు దిగజారిపోతుంది. వరసగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. పాకిస్తాస్ సూపర్ లీగ్(PSL) నుంచి విదేశీ క్రికెటర్లు బయటకు వస్తున్నారు. వీరంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL)లో ఆడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐపీఎల్‌లో అమ్ముడుపోని క్రికెటర్లు మాత్రమే పీఎస్‌ఎల్‌లో ఆడుతున్నారనే ప్రచారం ఉంది. ఇక ఇప్పుడు, కామెంటేటర్లు కూడా పీఎస్ఎల్ వీడి ఐపీఎల్ కోసం వస్తున్నారు.

Read Also: New Scheme In Telangana: తెలంగాణలో మరో కొత్త స్కీమ్ ప్రారంభం.. సీఎం చేతుల మీదుగా..

పీఎస్ఎల్ కామెంటేటర్స్ ప్యానెల్‌లో ఉన్న మాజీ ఇంగ్లాండ్ స్టాన్ నిక్ నైట్, ఇప్పుడు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి ముందు ప్లేయర్లు దాసున్ శనక, స్పెన్సర్ జాన్సన్, బ్లెస్సింగ్ ముజరబాని వంటి ఆటగాళ్లు పీఎస్ఎల్ వీడి ఐపీఎల్‌లో చేరారు. పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) చీఫ్ మోహ్సీన్ నఖ్వీకి ఈ పరిణామాలు తీవ్ర అవమానంగా మిగిలిపోతున్నాయి. వెళ్లిపోయిన ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని నఖ్వీ హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే, శుక్రవారం పీఎస్ఎల్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. లాహోర్‌లో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్ మెన్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ కూడా చాలా నిశ్శబ్ధంగా జరిగింది. ప్రేక్షకులు ఎవరూ మ్యాచ్‌కు హాజరుకాలేదు. ఎలాంటి హడావుడి లేకుండా, ప్రారంభ కార్యక్రమాలు లేకుండా టోర్నీ ప్రారంభమైంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రజలు పెట్రోల్, డిజల్ ఆదా చేసే పనిలో ఉన్నారు. దీంతోనే ప్రేక్షకులు ఎవరూ మ్యాచ్‌కు రాలేదు. దీనికి తోడు తాలిబాన్‌తో జరుగుతున్న యుద్ధం కూడా పీఎస్ఎల్ భద్రతపై ప్రభావం చూపుతున్నాయి.