
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది, ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం మన టాలీవుడ్ స్టార్ హీరో స్వయంగా రంగంలోకి దిగి, బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్, దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన దురంధర్ సినిమాతో శాశ్వత్ సచ్‌దేవ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు, ఆ సినిమా విజయంలో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సహా సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం సక్సెస్ గ్రాఫ్‌లో టాప్ గేర్‌లో ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో దృష్టిని ఆకర్షించడం విశేషం, నిజానికి, శాశ్వత్ సచ్‌దేవ్ తన విలక్షణమైన శైలితో సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు.
Also Read:Jayam Ravi: పెళ్లి కాలేదని చెప్పి ప్రియురాలితో గోవాలో ల్యాండ్ కొన్న స్టార్ హీరో?
“ఉరి: ద సర్జికల్ స్ట్రైక్” వంటి చిత్రాలతోనే తన సత్తా చాటిన ఆయన, ‘ధురంధర్’తో గ్లోబల్ లెవల్ ఇంపాక్ట్ చూపించారు, ఇప్పుడు మన స్టార్ హీరో తన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం శాశ్వత్ అయితేనే “ఫ్రెష్ అండ్ హై ఇంపాక్ట్” మ్యూజిక్ ఇవ్వగలరని భావిస్తున్నారట. ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే, సౌత్ ఇండియన్ సినిమాకి ఒక సరికొత్త సౌండింగ్ పరిచయం కావడం ఖాయం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉండగా, శాశ్వత్ సచ్‌దేవ్ రాకతో ఆ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.