Reading Time: < 1 minute
China Peace Movie Mea Review Salman Khan Galwan Controversy

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక చిన్న సినిమా పేరు ఢిల్లీ స్థాయికి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు కమర్షియల్ హంగులతో వార్తల్లో నిలిచే టాలీవుడ్, ఇప్పుడు అనూహ్యంగా ఒక జియో పొలిటికల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అదే ‘చైనా పీస్’ సినిమా, తాజాగా ఈ సినిమాను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పరిశీలనకు పంపినట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.ఈ సినిమా చుట్టూ ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం.. దీన్ని బాలీవుడ్ భారీ ప్రాజెక్టులైన సల్మాన్ ఖాన్ ‘గాల్వన్’, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్ ‘దురందర్ 2’. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే యుద్ధ ప్రాతిపదికన రూపొందుతున్న ఒక తెలుగు సినిమాను కూడా ఆ సినిమాల స్థాయిలో, ఎంఈఏ (MEA) ఫ్లాగ్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు లేదా భారీ వార్ మూవీస్ మాత్రమే విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వెళ్తుంటాయి కానీ, పెద్దగా ప్రచారం లేని ఒక తెలుగు చిత్రం ఈ రేంజ్‌లో హైలైట్ అవ్వడం వెనుక ఉన్న కంటెంట్ ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సరిహద్దు వివాదాలు లేదా అంతర్జాతీయ సంబంధాలకు భంగం కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రాజెక్ట్ ఈ స్థాయిలో జియో పొలిటికల్ వివాదం కారణంగా కేంద్ర స్థాయిలో చర్చకు రావడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామానా? లేక భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య ఉన్న రహస్య దౌత్య సంబంధాలను ఏమైనా టచ్ చేసిందా? అన్నది తెలియాల్సి ఉంది, సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ లాంటి భారీ సినిమాలతో సమానంగా దీనికి ప్రాధాన్యత దక్కడం చూస్తుంటే, దీని వెనుక ఏదో పెద్ద కథే ఉందని ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ గుసగుసలాడుకుంటున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుండి క్లియరెన్స్ వస్తేనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.