Reading Time: < 1 minute

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేత న్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనా క్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ యూ త్. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న యూత్ మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోలు శ్రీ విష్ణు, సత్యదేవ్, డైరెక్టర్స్ సాయి రాజేశ్, వశిష్ట అతిథులుగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ “తమిళంలో యూత్ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్. తెలుగులో కూడా అలాంటి సక్సెస్ రావాలి”అని అన్నారు. హీరో, డైరెక్టర్ కెన్ మాట్లాడుతూ “హీరోగా, దర్శకుడిగా యూత్ నా ఫస్ట్ మూవీ ఇది. రఘువరన్ బీటెక్ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రతి ప్రేక్షకుడు మా మూవీని కూడా ఎంజాయ్ చేస్తారు. యూత్, లవర్స్ మాత్రమే కాదు తల్లిదండ్రులు కలిసి చూడాల్సిన చిత్రమిది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి దినేష్, ప్రియాన్షి యాదవ్, అనిష్మ అనిల్ కుమార్, సందీప్, జై క్రిష్, వినయ్ రత్నం, సనరే తదితరులు పాల్గొన్నారు.