Reading Time: < 1 minute

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. మార్చి 26న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీగా దీన్ని రూపొందించారు. హీరో, హీరోయిన్ మధ్య ఉండే ప్రేమ, గిల్లికజ్జాలను హత్తుకునేలా తెరకెక్కించారు. హీరో హర్ష్ రోషన్ తన మరదలైన హీరోయిన్ ప్రేమను గెలవటానికి ఏం చేశాడు? తనకు ఎదురైన ఇబ్బందులేంటి? వాటిని ఎలా అధిగమించాడు? అనే అంశాలతో బ్యాండ్ మేళం సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.