
పాడైపోయిన వస్తువులతో సమోసాలు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం, కుల్సుంపుర పోలీసులు కలిసి జియాగూడలో దాడి చేశారు. సమోసాలు తయారు చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.5లక్షల విలువైన పాడైపోయిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…జియాగూడలోని ఎస్‌బిఎ గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంటిలో అబ్దుల్ రషీద్(73) అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన గుడ్లు, పదే పదే మరిగించిన నూనెను ఉపయోగించి సమోసాలు తయారు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హెచ్ ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం),
కుల్సుంపురా పోలీసులు సమన్వయంతో జియాగూడలోని ఒక అక్రమ ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేసి సీజ్ చేశారు. తయారీ కేంద్రానికి ఎలాంటి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేదా ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు పాడైన గుడ్లతో ఎగ్ సమోసాలు , స్వీట్ కార్న్ సమోసాలు , ఉల్లిపాయ సమోసాలు తయారు చేస్తున్నాడు. అన్ని వస్తువులను సీజ్ చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో అ అప్పగించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.