
‘ధురంధర్: ది రివెంజ్’ మూవీ.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఇండియా బాక్సాఫీస్ రూ.200 కోట్ల మార్కును దాటింది. ఈ క్రమంలోనే మూవీ అనేక రికార్డులు నెలకొల్పుతూ దూసుకెళ్తోంది. రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ డైరెక్షన్.. అదిరిపోయే స్పై యాక్షన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా, సౌత్ ఆడియన్స్, సెలబ్రెటీలలో కూడా క్రేజీ బజ్ నడుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మహేష్ బాబులు మెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ చేసిన తాజా సోషల్ మీడియా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాపై సౌత్ ఇండియాన్ స్టార్స్ ఇచ్చిన రివ్యూలు, ప్రశంసలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచాయి.
సెలబ్రెటీ ప్రశంసలపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
ఇటీవల అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఒక క్రిప్టిక్ వీడియోను షేర్ చేస్తూ పరోక్షంగా స్పందించారు.
ఆ వీడియోలో పాత హిందీ పాట “Abhi Na Jao Chhod Kar” వినిపిస్తూ, “నేను ధురంధర్‌కు చాలా దూరంగా ఉన్నాను… మీరు?” అనే క్యాప్షన్ జతచేశారు. ఈ పోస్ట్ ద్వారా ఆయన సినిమా మీద తన అభిప్రాయాన్ని సూచించినట్లు భావిస్తున్నారు.
Me .. Bahut Door from #Dhurandhar ….are you #justasking pic.twitter.com/UniBXj8mCN
— Prakash Raj (@prakashraaj) March 19, 2026
“ఒబ్లిగేషన్స్” (Signs of Obligations) వ్యాఖ్యపై చర్చ
అదే సమయంలో మరో పోస్టును షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. “కృతజ్ఞతలు తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు దక్షిణాదికీ విస్తరిస్తున్నాయా?.. #justasking” అంటూ ట్వీట్ చేశారు.
ఈ వ్యాఖ్యల ద్వారా, టాలీవుడ్ స్టార్ హీరోలు ధురంధర్ సినిమాపై వ్యక్తం చేస్తున్న ప్రశంసలు నిజమైన అభిప్రాయాలకంటే పరస్పర మర్యాదల కోసమో, మొహమాటానికో లేదా ఇతర కారణాల వల్లనో కావచ్చని పరోక్షంగా సూచించారు.
దక్షిణాది నటులు సినిమా గురించి మాట్లాడుతున్న తీరు “ఒబ్లిగేషన్స్”లా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినీ రంగంలో పెరుగుతున్న పరస్పర ప్రమోషన్ కల్చర్, సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రమోషన్లకు ఇది ఒక విమర్శగా పలువురు భావిస్తున్నారు.
ALSO READ : సుధీర్ బాబుతో హన్సిక.. ఉత్కంఠగా ‘గల్లీ’ వెబ్ సిరీస్ గ్లింప్స్..
Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K
— Prakash Raj (@prakashraaj) March 19, 2026
అల్లు అర్జున్ స్పెషల్ రివ్యూ..
అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినీ బృందానికి అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు. “ధురంధర్ 2 అంటే దేశభక్తికి అద్దం పట్టే స్టైలిష్ యాక్షన్. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉందన్నారు. ఈ మూవీలో క్లాప్స్ కొట్టించే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇదొక మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైనర్” అని అల్లు అర్జున్ తన రివ్యూలో పేర్కొన్నారు.
Just Watched #Dhurandhar2⁰Patriotism with swag 🇮🇳
A film that will make every patriot proud 🇮🇳⁰Many clap-trapping moments 👏🏽
BLAST! 💥
Congratulations to the entire team.⁰Fine performances by @ActorMadhavan garu & all actors . Technical brilliance .So proud to have a…
— Allu Arjun (@alluarjun) March 18, 2026
ముఖ్యంగా తన సోదర సమానమైన రణవీర్ సింగ్ నటనను ప్రశంసిస్తూ, “RVS ఈజ్ ఆన్ ఫైర్” అని, మన దేశంలో ఇలాంటి వెర్సటైల్ నటుడు ఉండటం గర్వకారణమని కొనియాడారు. అలాగే దర్శకుడు ఆదిత్య ధర్ గురించి చెబుతూ, ఆయన బంతిని స్టేడియం దాటించేశారని (Hit the ball out of the park) ప్రశంసించారు.
మహేష్ బాబు X వేదికగా ట్వీట్ చేస్తూ.. “ధురంధర్ 2 ఒక అద్భుతమైన విస్ఫోటనం! రణ్‌వీర్ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన. నిలబడి చప్పట్లు కొట్టించేలా ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు అమోఘం. మ్యాడీ (మాధవన్) నటన, శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ధురంధర్ 2 చూసి, వేడుక చేసుకోవాల్సిన చిత్రం అంటూ చిత్ర బృందానికి అభినందనలు” తెలిపారు మహేష్.
#DhurandharTheRevenge is an explosion executed with perfect precision!!!! The finest version of Ranveer unleashed and how… 💥💥💥 The way Aditya Dhar has conceived and delivered this standing ovation worthy experience is remarkable 👏🏻👏🏻👏🏻 Special mention to Maddy’s performance…
— Mahesh Babu (@urstrulyMahesh) March 19, 2026
జూనియర్ ఎన్టీఆర్ X వేదికగా రివ్యూ ఇస్తూ.. “భారతీయ ప్రేక్షకులకు ఒక తుఫానును పరిచయం చేసిన టీమ్‌కు బిగ్ సెల్యూట్. రణ్‌వీర్ సింగ్ స్క్రీన్‌పై కేవలం అద్భుతంగా నటించడమే కాదు. విశ్వరూపం చూపించారు. ఇలాంటి చిత్రాన్ని రూపొందించడానికి దృఢ సంకల్పం, నిర్భయమైన దృష్టి అవసరం. ఆదిత్య ధర్ తన దార్శనికతతో ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేశారు.
ప్రతి సన్నివేశాన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి తనకున్న ప్రతీ సాధనాన్ని ఉపయోగించుకున్న ఆయన తీరుకు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి. అలాగే, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు ఎంతో లోతుగా ఉన్నాయి. క్లాసిక్ నటుడు అక్షయ్ ఖన్నా వేసిన పునాదిపై ఈ సీక్వెల్ అద్భుతంగా నిలబడింది.” అని ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు.
A big salute to the team of #DhurandharTheRevenge for delivering a storm to Indian audiences.
Ranveer sir @RanveerOfficial is not just breathtaking…. He delivered an absolute masterclass on screen.
It takes conviction and fearless vision to mount a film like this and Aditya…
— Jr NTR (@tarak9999) March 19, 2026
“రేపటి నుంచి భారతీయ సినిమాలో కొత్త చరిత్ర మొదలవుతుంది. ఆదిత్య ధర్ ఒక జీనియస్. రణ్‌వీర్ సింగ్ తన నటనతో అగ్నిపర్వతంలా చెలరేగిపోయాడు. భారత్ మాతాకీ జై!” అని విజయ్ ట్వీట్ చేశాడు.
Tomorrow onwards – something big is going to happen in Indian cinema and culture.
4 words. “Bharat Maata ki JAI!”
Immense love and respect to the entire cast and crew. @AdityaDharFilms is a mad genius. @RanveerOfficial is all in explosive. @ActorMadhavan @rampalarjun Sara…
— Vijay Deverakonda (@TheDeverakonda) March 18, 2026
మరోవైపు యూట్యూబర్ ధృవ్ రాథీ కూడా ఈ సినిమాపై స్పందించారు. అయితే, ప్రశంసలు కాకుండా విమర్శలు చేస్తూ, ఇది ప్రొపగాండా ఫిల్మ్‌లా అనిపించిందని పేర్కొన్నాడు. దీంతో ఈ చిత్రంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
I called Aditya Dhar a BJP propagandist 3 months ago.
Now everyone will see it. It was subtle in the previous film, but he went so blatant this time in overconfidence. Remember how I said, well-made propaganda is more dangerous? Ab toh well-made bhi nahi raha. Lol
— Dhruv Rathee (@dhruv_rathee) March 19, 2026
మొత్తంగా చూస్తే, ఒకవైపు స్టార్ హీరోల ప్రశంసలు, మరోవైపు ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాథీ వంటి వ్యక్తుల విమర్శలతో ‘ధురంధర్: ది రివెంజ్’ చుట్టూ వివాదం నెలకొంది. ఈ వివాదం సినిమాపై ఆసక్తిని మరింత పెంచే అవకాశముంది.