Reading Time: < 1 minute

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో  వడగండ్ల బీభత్సం..జిల్లా వ్యాప్తంగా  3,450 ఎకరాల్లో పంట నష్టం

Caption of Image.

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో గురువారం అర్ధరాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మోస్రా, చందూర్, పోతంగల్, రుద్రూర్, వర్ని, సాలూరా, భీంగల్, సిరికొండ, జక్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలాల్లో ఈదురుగాలులకు తోడు వడగండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వాన కారణంగా జిల్లా వ్యాప్తంగా 3,45 0ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 2,740 ఎకరాల్లో వడ్లు రాలిపోగా, 690 ఎకరాల్లో మక్క, 20 ఎకరాల్లో జొన్న పంట దెబ్బతింది. అమ్మడానికి కల్లాల్లో రెడీగా ఉన్న ఎర్రజొన్న, ఉడికించి ఆరబెట్టిన పసుపు మొత్తం వర్షంలో తడిసిపోయింది. 

భద్రాద్రి జిల్లా మర్కోడులో…

ఆళ్లపల్లి, వెలుగు : భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మర్కోడులో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్లవాన పడింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.