Reading Time: < 1 minute
South Korea Car Plant Fire 10 Dead 59 Injured In Daejeon Factory Blaze

Car Plant Fire Accident: దక్షిణ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కొరియాలోని డేజియన్ నగరంలో ఉన్న కార్ పార్ట్స్ తయారీ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, 59 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉండగా, మరో 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే నలుగురు కార్మికులు గల్లంతైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ప్లాంట్‌లో మొత్తం 170 మంది కార్మికులు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Iran Attack: హిందూ మహాసముద్రంలోని ‘డియాగో గార్సియా’పై ఇరాన్ దాడి.. రెండు క్షిపణుల ప్రయోగం..

మృతదేహాల్లో ఒకటి రెండో అంతస్తులో, మిగతావి మూడో అంతస్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లలేకపోయారు. ప్లాంట్‌లో సుమారు 200 కిలోల సోడియం ఉండటం కూడా పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చింది. సోడియం సరైన విధంగా నిర్వహించకపోతే పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూఙ్ స్పందిస్తూ.. రక్షణ చర్యలకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.

SBI: ఎస్‌బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..