Reading Time: < 1 minute

 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రకటించడం ఇంటర్ విద్యా జెఎసి చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియే విద్యాశాఖ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాల్లోని మూల్యాంకన కేంద్రాల్లో భోజన సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి సిఎం రేవంత్‌రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, సర్వశిక్షా అభియాన్ నిధుల ద్వారా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం అందించడంతో ప్రతి కళాశాలకు శుద్ధమైన త్రాగు నీరు కోసం ఆర్‌ఒ ప్లాంట్ల ఏర్పాటు చేయడం ఇంటర్ విద్యా వ్యవస్థ బలోపేతమవుతుందని పేర్కొన్నారు.