Reading Time: < 1 minute
Mp Putta Mahesh Clarifies Allegations Says Ready For Fresh Drug Test Anytime

MP Putta Mahesh Clarifies: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని స్పష్టంగా తెలిపారు. పార్టీకి వెళ్లిన విషయంపై వివరణ ఇస్తూ, వ్యక్తిగత పరిచయాల కారణంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తనను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Read Also: Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల

అలాగే, ఒక పరీక్షా నివేదిక నెగటివ్‌గా వచ్చిందని, మరో నివేదిక పాజిటివ్‌గా వచ్చినట్లు చెప్పడం గందరగోళానికి దారితీసిందని తెలిపారు పుట్టా మహేష్‌.. అయితే, ఇంకా ఒక రిపోర్టు రావాల్సి ఉందని, అది వచ్చిన తర్వాత స్వయంగా సంబంధిత అధికారులను కలిసి పూర్తి వివరణ ఇస్తానని చెప్పారు. తనపై ఉన్న అనుమానాలన్నింటినీ నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడే టెస్ట్ చేయాలన్నా తాను సిద్ధమేనని ఎంపీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో, పుట్టా మహేష్ ఇచ్చిన వివరణపై పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.