Reading Time: < 1 minute

పశ్చిమాసియా ఘర్షణలో ఆరుగురు ఇండియన్స్ మృతి, ఒకరు మిస్సింగ్: విదేశాంగ శాఖ

Caption of Image.

న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు భారతీయులు మృతి చెందగా.. ఒకరు గల్లంతు అయినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల మందిని స్వదేశానికి తరలించినట్లు తెలిపింది. అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో గల్ఫ్ అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్. మహాజన్ మాట్లాడుతూ.. మిడిల్ ఈస్ట్ కాన్‌ఫ్లిక్ట్‎లో దురదృష్టవశాత్తు ఆరుగురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గల్లంతు అయ్యారని తెలిపారు. 

మృతదేహాలను త్వరగా ఇండియా రప్పించేందుకు సౌదీ అరేబియా, ఒమన్, ఇరాక్, యూఏఈలలోని భారత రాయబార కార్యాలయాలు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు. పశ్చిమాసియా ఉద్రికత్తలు మొదలైన 2026, ఫిబ్రవరి 28 నుంచి సుమారు 3 లక్షల మంది భారతీయులను గల్ఫ్ నుంచి విజయవంతంగా భారతదేశానికి తరలించామని తెలిపారు. 

భారతీయ ఎయిర్ లైన్స్ షెడ్యూల్ లేకుండా ఇండియన్స్ తరలింపునకు ప్రత్యేక విమానాలు నడుతున్నాయని చెప్పారు. గల్ఫ్‎లో సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ కార్మికుల భద్రతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తూనే ఉందని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.