Reading Time: < 1 minute
Mp Putta Mahesh Responds To Show Cause Notice Tdp Decision Awaited

MP Putta Mahesh: తెలుగుదేశం పార్టీ అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాడు ఏలూరు లోక్‌సభ సభ్యులు పుట్టా మహేష్‌ కుమార్.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఐదు రోజుల గడువుతో నోటీసు జారీ చేసింది. గడువు ముగియడంతో, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ నిన్న రాత్రి తన సమాధానాన్ని సమర్పించినట్లు సమాచారం.

Read Also: Iran War: ఇరాన్‌కు రూ.18 కోట్లు చెల్లించి.. హర్మూజ్ జలసంధిని దాటిన చమురు నౌక..

కాగా, షోకాజ్ నోటీసులో ఉన్న అంశాలను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే, తన వివరణలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని పుట్టా మహేష్ పేర్కొన్నట్టు సమాచారం. ముందుగా నెగటివ్ వచ్చిన పరీక్ష ఫలితం, తరువాత పాజిటివ్‌గా ఎలా మారిందని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ వ్యవహారంలో తనను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి తనను బలిపశువుగా మార్చారని కూడా వివరణలో పేర్కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పుట్టా మహేష్ ఇచ్చిన వివరణను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం పార్టీ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.