Reading Time: < 1 minute
Zomato Increased Its Platform Fee From Rs 12 50 To Rs 14 90

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఇష్టమైన ఆహారాన్ని నిమిషాల్లోనే పొందేందుకు వీలు ఏర్పడింది. ఆహార ప్రియులు చాలామంది స్విగ్గీ, జొమాటో ల ద్వారా ఫుడ్ ఆర్డర్స్ ను పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ మొత్తం ఒకటే టెన్షన్ అదే గ్యాస్ కొరత. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడింది. మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడ్డట్టుగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్ ఫామ్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Also Read:Aditya Dhar: ధురంధర్ 3 కాదు.. డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదే!

ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన ప్లాట్‌ఫామ్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఫీజులను పెంచడంతో, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం మరింత ఖరీదైనదిగా మారింది. జొమాటో ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.12.50 నుండి రూ.14.90కి, అంటే 19 శాతం పెంచింది. ఈ సవరించిన ప్లాట్‌ఫారమ్ ఫీజు ఈరోజు, మార్చి 20వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఈ పెంపు చోటుచేసుకోవడం గమనార్హం. జొమాటోకు పోటీదారు అయిన స్విగ్గీ, ప్రస్తుతం పన్నులతో సహా ప్రతి ఆర్డర్‌కు ₹14.99 ప్లాట్‌ఫారమ్ ఫీజును వసూలు చేస్తోంది. సాధారణంగా, ఈ రెండు కంపెనీలు ఇలాంటి సేవలకు దాదాపు ఒకే విధమైన ఫీజులను వసూలు చేస్తాయి. స్విగ్గీ కూడా త్వరలో తన ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచే అవకాశం ఉంది.