Reading Time: < 1 minute
Rice Vs Chapati Diabetes Diet What Should Diabetics Eat At Night

Rice vs Chapati: చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే ప్రధాన సందేహం.. రాత్రి సమయంలో అన్నం తినాలా లేక చపాతీలు తినాలా అని. ఈ రెండిటి మధ్య ఉన్న పోషక విలువల తేడాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. మరి అన్నం లేదా చపాతీల మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయి.. వీటిని తింటే మేలో ఇక్కడ చూసేద్దాం..

IPL 2026: ఐపీఎల్‌ మ్యాచ్‌లపై సెలక్టర్ల ఫోకస్‌.. ఇక్కడ ఆడితేనే వరల్డ్‌ కప్‌ 2027 తుది జట్టులో చోటు..!

కార్బోహైడ్రేట్ల పరిమాణం:
ఒక కప్పు అన్నంలో (సుమారు ఒక పిడికెడు) తీసుకుంటే అందులో దాదాపు 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు వరకు ఉంటాయి. అదే ఒక చపాతీలో కేవలం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి.

పీచు పదార్థం (Fiber):
అన్నంతో పోలిస్తే చపాతీలో పీచు పదార్థం (Fiber) సుమారు 2 గ్రాములు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది.

పరిమాణం (Portion Control):
మీరు అన్నం తిన్నా లేదా చపాతీ తిన్నా.. ఎంత పరిమాణంలో తింటున్నారనేది చాలా ముఖ్యం. డయాబెటిక్ పేషెంట్లు ఒక కప్పు అన్నం తినవచ్చు లేదా దానికి బదులుగా రెండు చపాతీలు తీసుకోవచ్చు. సాధారణంగా అన్నం తినేటప్పుడు మనం కొలత లేకుండా ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. కానీ చపాతీలు అయితే ఒకటి లేదా రెండు అని లెక్క ప్రకారం తింటాము కాబట్టి, ఆహార నియంత్రణ సులభమవుతుంది.

RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా? రోజా ఫైర్‌..

కాబట్టి రాత్రి సమయాల్లో (Dinner) డయాబెటిక్ పేషెంట్లు రెండు చపాతీలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది.